రిలే నిరహార దీక్షా శిబిరంలో 3 లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్ ఓ సి అందజేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్.

కంటోన్మెంట్ జనవరి 25
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ముఖ్యమంత్రి సహాయనిధి పేదల కు ఒక వరం అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఆదివారం కార్ఖానా రిలే నిరాహార దీక్ష శిబిరంలో మూడు లక్షల 50వేల రూపాయలు విలువైన ఎల్ఓసి ని బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు.
నియోజకవర్గ పరిధిలోని పికెట్ రాంనగర్ కు చెందిన రవి గౌడ్ సతీమణి రమ్య అనారోగ్యానికి గురై ఆపరేషన్ నిమిత్తం నిమ్స్ హాస్పటల్ లో చేరింది.ఆపరేషన్ ఖర్చుల కోసం ప్రభుత్వానికి ఎమ్మెల్యే కార్యాలయం నుంచి దరఖాస్తు చేయడంతో 3లక్షల 50 వేల రూపాయల విలువైన ఎల్ ఓ సి ని ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి,ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *