సికింద్రాబాద్ జనవరి 26
(జే ఎస్ డి ఎం న్యూస్)
క్రీడల ద్వారా దేహదారుఢ్యం పెంపొందించుకోవడంతోపాటు, మంచి ఆరోగ్యం ,మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుకోవచ్చని ,అనేక వ్యాధులను జయించవచ్చని ఏబీవీ ఫౌండేషన్ చైర్పర్సన్ గంగాపురం కావ్య కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఖేలో మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ కు కావ్య కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ బిజెపి పార్లమెంట్ ఇన్చార్జి రాజశేఖర్ రెడ్డి , సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు), కార్పొరేటర్ కొంత దీపిక నరేష్, అశ్విన్ ,సురేష్, బీరం నర్సింగరావు ,అజయ్ నాయుడు, సురేష్ రావల్, శ్రీనివాస్, సురేష్, సందీప్ వర్మ తది తరులు పాల్గొన్నారు .


