ఓటు హక్కుతో ప్రజా స్వామ్యం పటిష్టం

ఓటు వేసే హక్కు ప్రతి పౌరుడి కర్తవ్యమని తహసీల్దార్ బచ్చల వెంకట రమణా రావు
అన్నారు. తాళ్లూరులో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. తహసీల్దార్ రమణా రావు, డిప్యూటీ తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్ర, రీ సర్వే డిటీ ప్రశాంత్, ఆర్వి సుధీర్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస రావు, జూనియర్ అసిస్టెంట్ రియాజ్, కంప్యూటర్ ఆపరేటర్ చందు, ఎలక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ సుజాతలు పాల్గొని ఓటు హక్కు ప్రాముఖ్యత వివరిస్తూ ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేసారు. తాళ్లూరులో వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బిఎల్ ఓ గ్రామ టిడిపి నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డిలు పాల్గొని ప్రతిజ్ఞ చేసారు. ఓటు హక్కుతో నేటికి భారత దేశంలో ప్రజా స్వామ్య ప్రక్రియ పటిష్ట స్థితిలో ఉన్నదని వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *