క్షేత్ర స్థాయి నుండి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం గ్రామ కమిటీల నిర్మాణంపై మండల పార్టీ అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ లు పార్టీ మండల అబ్జర్వర్లు గ్రామ అబ్జర్వర్లతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్థాయి నుండి పార్టీ కమిటీలను ఎలా పూర్తి చేయాలో వివరించడం జరిగినది. ప్రధానంగా కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త కు భవిష్యత్ లు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మండల స్థాయి ముఖ్యనేతలు గ్రామ స్థాయిలో అందరిని కలుపుకుని పని చేయాలని తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా అండగా నిలిచి మనోధైర్యం నింపాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ కమిటీ తో పాటు యువత మహిళా రైతు బీసీ ఎస్సీ సోషల్ మీడియా విద్యార్థి కమిటీలు వేయాలని కష్టపడ్డా ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో దర్శి అసెంబ్లీ పరిశీలకులు బొట్ల రామారావు , దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి ఎంపీపీ ఉషా మురళి కురిచేడు మండల పార్టీ అధ్యక్షులు సుబ్బయ్య యాదవ్ జడ్పిటిసి నుసుం నాగిరెడ్డి ముండ్ల మురు మండల పార్టీ అధ్యక్షులు చింత శ్రీనివాసరెడ్డి జెడ్పిటిసి రత్నరాజు, రాష్ట్ర సయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మా రెడ్డి, తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు తూము వెంకట సుబ్బారెడ్డి, దర్శి పట్టణ అధ్యక్షులు ముత్తి నీడి సాంబ, దర్శి వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, కె వి రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
