బేగంపేట జనవరి 26 , (జే ఎస్ డి ఎం న్యూస్) : బేగంపేట డివిజన్ పరిధిలోని రసూల్ పుర చౌరస్తాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్ సుధాం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హోటల్ నీలిమ హాజరయ్యారు. ముందుగా రసూల్‌పురా చౌరస్తాలో జాతీయ జెండాను కోట నీలిమ ఆవిష్కరించారు. వివిధ క్రీడలలో ప్రతిభ చూపిన వారికి కోట నీలిమ, విశాల్ సుధాం లు బహుమతులను అందజేశారు. డివిజన్ పరిధిలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీ పాటిగడ్డ ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి చిన్నారులకు మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.


