బోయిన్ పల్లి నారాయణ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

బోయినపల్లి జనవరి 26 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
బోయిన్ పల్లి నారాయణ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాలప్రధానోపాధ్యాయులు ఏబీవీపీ కార్యకర్తలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు గణతంత్రం గురించి స్వాతంత్రం గురించి తెలియజేశారు .విద్యార్థులు కూడా తమదైన శైలిలో ఉపన్యాసాలు ఇచ్చి నృత్యాలతో సందడి చేశారు. ఏటీఎం పురుషోత్తం మాట్లాడుతూ జనవరి 26 కు ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. తమను తాము పరిపాలించుకోవడమే నిజమైన గణతంత్రం అని నేటి విద్యార్థులు కూడా ఇప్పటినుండే స్వతహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలగాలని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
స్వీయ క్రమశిక్షణమే స్వయం పరిపోలనకు పునాది. బోయిన్ పల్లి నారాయణ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *