(జే ఎస్ డి ఎం న్యూస్ ) , బన్సిలాల్ పేట డివిజన్ పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ కుర్మ హేమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా బైబిల్ హౌస్ వద్ద యువశక్తి ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. నవోదయ కమ్యూనిటీ హాల్ తదితరు ప్రాంతాల్లో జాతీయ జెండాలను కార్పొరేటర్ ఆవిష్కరించారు సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చిన్నారులు పాల్గొన్నారు.
