కంటోన్మెంట్ జనవరి 26 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్ష కు మద్దత్తుగా సోమవారం ప్రొఫెసర్ కోదండరాం, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్ దీక్ష శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశ వైఖరితో కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజాస్వామ్యం లేకుండా నామినేటెడ్ వ్యవస్థతో కంటోన్మెంట్ ప్రజలపై చేస్తున్న రాచరిక పాలనకు వ్యతిరేకంగా, కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ న్యాయమైనది అని, విలీనం చేయాల్సిందే అని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజల బాధ్యతను,వారి అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పి, నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి కంటోన్మెంట్ ప్రాంతాన్ని
రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని కేంద్రం లోని బిజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కంటోన్మెంట్ ప్రాంత ప్రజల గొంతును ఢిల్లీ వరకు చేరేలా కృషి చేస్తానని,ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుని దీక్షకు సంఘీభావం తెలిపామని కోదండరాం , ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. సంఘీభావం తెలిపిన వీరికి ఎమ్మెల్యే శ్రీగణేష్ ధన్యవాదాలు తెలియజేశారు.


