బోయిన్ పల్లి జనవరి 26 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బోయిన్ పల్లిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జీ ఇటికే శ్రీ కిషన్ మాదిగ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మంద మధుకర్ మాదిగ, బాబేందర్, విశ్వనాథ్, శ్రీకాంత్, రఘు, సంతోష్, చందు, నర్సింగరావు, దయానంద్, గిరి, నరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
