దాతల సహకారంతో అభివృద్ధి పథంలో తురకపాలెం ఉన్నత పాఠశాల – దాతలకు ఘన సన్మానం

పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయుల తో పాటు గ్రామస్తులు సహకరించడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు పి వెంకట్రావు అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తురకపాలెం లో పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్రె వెంకట్రావు మాట్లాడుతూ తాళ్లూరు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తురకపాలెం ఈ విద్యా సంవత్సరంలోనే ఉన్నత పాఠశాల గా అప్గ్రేడ్ చేయబడిందని తెలిపారు. పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడంలో గ్రామస్తుల సహకారం మరువలేనిదని ఆయన తెలిపారు. గ్రామ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి విద్యార్థుల కోసం ఒక ఆటో ఏర్పాటు చేశారని , పాఠశాల ఉన్నతీకరణకు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి కృషి చేశారని, పాఠశాలలో త్రాగునీటి కొరకు కుమ్మిత తిరుపతిరెడ్డి కెంట్ వాటర్ ఫిల్టర్ బహుకరించారని , ఎం సుబ్బారెడ్డి డీలర్ పది కుర్చీలు , సిహెచ్ పాపిరెడ్డి పాఠశాలకు ఎలక్ట్రిక్ బెల్ , మాజీ విద్యా కమిటీ చైర్మన్ కుమ్మిత రమణారెడ్డి పాఠశాల కు సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారని తెలిపారు కుమ్మిత సుబ్బారెడ్డి పాఠశాలకు ప్రింటర్ , వెలుతుర్ల వీరనాగిరెడ్డి పాఠశాల ఆవరణలో మొక్కలు ఏర్పాటుకు సహకరించారని చెప్పారు. కుమ్మిత శ్రీనివాస్ రెడ్డి పాఠశాలకు పది కుర్చీలు, సన్న బోయిన కృష్ణ పాఠశాలలో పనులు కోసం సిమెంట్ ఏర్పాటు చేశారని తెలిపారు. అంబటి జనార్దన్ రెడ్డి పాఠశాలకు ఆర్చ్ కట్టిస్తామని హామీ ఇచ్చినారని చెప్పారు. ఇలా పాఠశాలకు ఏ అవసరమన్నా మేమున్నామని సహకరిస్తున్నందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తురకపాలెం గ్రామ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని పాఠశాల అభివృద్ధి కోసం మా వంతు సహకరిస్తామని గ్రామస్తులందరూ కూడా విద్యాభివృద్ధి కృషి చేయాలని అని పిలుపునిచ్చారు. మన గ్రామంలో పాఠశాలలో అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత అని ఆయన అన్నారు. రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా పాఠశాలకు సహకరించినటువంటి దాతలు కి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వివిధ పోటీల్లో విజేతలైన పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రామాంజనేయులు, ఉపాధ్యాయులు ఎం స్వామి దాసు, పి శ్రీనివాస్, వై మాధవి, బి చెన్నకేశవరావు, ఆర్వి శ్రీనివాసరావు, రోజమ్మ, టీవీ కృష్ణారావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *