‘ ఎట్ హోం ‘ కార్యక్రమం నిర్వహణ

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు సోమవారం సాయంత్రం నిర్వహించిన ‘ ఎట్ హోం ‘ కార్యక్రమం సందడిగా జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు, ఎస్ఎన్ పాడు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన రావు, బి ఎన్ విజయకుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా జడ్జి జస్టిస్ రాజా వెంకటాద్రి, జిల్లా ఎస్ పి వి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులను, అధికారులను జిల్లా కలెక్టర్ స్వయంగా పలకరించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు స్వయంగా పాటలు పాడి ఉత్సాహపరిచారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా గడిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *