ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్య ఉండడంతో విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థి సుంకర వెంకారెడ్డి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి దాతృత్వం చాటుకున్నారు. సోమవారం పాఠశాలలో వెంక రెడ్డి తన సొంత నిధులతో 4 లక్షల20 వేలతో ఏర్పాటు చేయించారు తల్లిదండ్రులైన సుంకర లక్ష్మారెడ్డి, పద్మ చేతుల మీదుగా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ పాఠశాలలో 420 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారని, ఏ సమస్య వచ్చినా పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
