ఉగాది పండుగకు గృహాల్లోకి ప్రవేశించేందుకుగాను మార్చి నెలాఖరులోపు ఎన్టీఆర్ గృహాలు పూర్తి చేయాలని జిల్లా హౌసింగ్ పీడీ పి.శ్రీనివాసప్రసాద్ తెలి పారు. తాళ్లూరులోని ఎన్టీఆర్ గృహనిర్మాణ కాలనీలను పీడీ గురువారం సందర్శిం చారు. గృహానిర్మాణాలు చపడుతున్న లబ్ధిదారులతో పీడీ మాట్లాడారు. ఈ సందర్బం గా మాట్లాడుతూ లబ్ధిదారులకు 1లక్ష 80వేల నిధులను నిర్మాణ దశలను బట్టి అం దజేయటం జరుగుతుందన్నారు. నిధులకు కొరతలేదని నిర్మాణాలు చేపట్టగానే బిల్లుల చెల్లింపు జరుగుతుందని తెలిపారు. ఈ రెండు లే అవుట్ల నందు 83 గృ హాలు నిర్మించాల్సి వుందన్నారు. మార్చిలోపు నిర్మాణాలు పూర్తి చేయకుంటే రద్దు అవుతాయన్నారు. లబ్దిదారులు ఆలస్యం చేయక త్వరిత గతిన పనులు చేపట్టి మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ఉగాది పండుగ సందర్బంగాగృహలబ్ధిదారులు గృ హప్రవేశాలు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సిహెచ్ హనుమంత రావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు జె.ప్రశాంతి, ఎస్. లక్ష్మీప్రసన్న, వర్క్ ఇన్పెక్టర్ ఎం.రవికుమార్, డీఈవో ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
