జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ పి.రాజబాబు
చెప్పారు. గురువారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లా వాటర్ – శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ పనుల్లో పురోగతిని ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ.
నాగేశ్వరరావు ఈ సందర్భంగా వివరించారు. అటవీ, రోడ్లు భవనాలు , రైల్వే, విద్యుత్తు శాఖల నుంచి రావాల్సిన అనుమతుల పెండింగ్, ఉత్తర ప్రత్యుత్తరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ అనుమతులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వారం రోజుల్లో పురోగతిని తెలియజేయాలని చెప్పారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్.ఈ.
అశోక్, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి ,ఏపీ సీపీడీసీఎల్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, రోడ్లు భవనాల శాఖ ఎస్ ఈ రవి నాయక్, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్, జిల్లా విద్యాధికారి రేణుక, వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, అటవీ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

