గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడంలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలని వక్తలు కోరారు .
తాళ్లూరులోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అనుబంధ విభాగాల అధ్యక్షులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వై సి పి పార్టీ మండల అధ్యక్షులు తూము వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదనరెడ్డి, రాష్ట్ర మాజీ సంయుక్త కార్యదర్శి ఐ.వి.సుబ్బారెడ్డి లు
మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో పటిష్టంగా కమిటీల నిర్మాణం జరుగుతుందని గ్రామ కమిటీల్లో అవకాశం దక్కించుకున్న వారు పార్టీ ఆదేశించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. గ్రామ కమిటీల్లో ఎంపిక కాబడిన వారు ఓటరు కార్డు, ఫోటో, ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిశీలకులు, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మారెడ్డి, జడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, విఠలా పురం సర్పంచి జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ వలి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు యామర్తి ప్రభుదాసు, మండల వ్యవసాయ విభాగం అధ్యక్షులు గువ్వల వెంకట శ్రీనివాసులురెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు కైపు అశోక్ రెడ్డి, జిల్లా ప్రచార విభాగం కార్యదర్శి గూడా గోపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎల్ .జి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు గోపుశ్రీనివాస్ రెడ్డి, యత్తపు మధుసూదన్ రెడ్డి, కుమ్మిత జయరామిరెడ్డి , కొర్రపాటి విష్ణు, సంగు కొండారెడ్డి, హరిబాబు, కటకం శెట్టి శ్రీనివాసరావు, పూనూరి దేవదానం, నగుళ్లవెంకట్రావు, బచ్చా, బొజ్జాసంజీవకుమార్, గోపి, కోర్నెల తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *