కరువది మేజర్ కాలువలోనీటిప్రవాహంకుఅడ్డుగా వున్న పూటికాడ మొక్కలను తొలగించిన గ్రామస్తులు

ఓబీసీ నుండి కరువది మేజర్ కు సాగర్ నీటిని విడుదల చేసినా దిగువకు నీరు సక్రమంగా సరఫరాకాక కాలువలో అడ్డుగా వున్న వూటికాడ మొక్కలను కొత్త పాలెం గ్రామస్తులు గురువారం తొలగించారు. కరువది మేజర్ కు నీరు విడుదలకు చర్యలు చేపట్టినా కాలువలో పెద్ద మొక్కలు, ఊటికాడ మొక్కలు ఏపుగా దట్టంగా నిండుకుని దిగువకు నీటి ప్రవాహం తగ్గింది. కరువది మేజర్ దిగువనున్న ఆయకట్టు చివరికి నీరు సక్రమంగా రావటంలేదు. ఈ ఆయకట్టు కింద ఎక్కువభాగం మొక్కజొన్న సాగు చేపట్టివున్నారు. ప్రస్తుతం ఆపంటకు ఈ సమయంలో ఒక తడి నీరు పెట్ట కుంటే మొక్కజొన్న ఎండి పోయి నష్టపోతామని రైతాంగం అధికారు లకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించారు. దీంతో ఎస్ఎస్పీ అధికారులు నీటిని విదుల చేశారు. దిగువకు సక్రమంగా నీరు ప్రవహించేందుకు కాలువలో పిచ్చి మొక్కలు , నాచు అడ్డుగా వుండటంతో కొత్తపాలెం గ్రామస్తులు స్వచ్చందంగా వెలుగువారిపాలెం వద్ద ప్రధాన కాలువలోకి దిగి కరువది మేజన్ కాలువలో వున్న పిచ్చి మొక్కలను , నాచు తొల గించారు. దీంతో దిగువకు నీటి ప్రవాహం సాఫీగా సాగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *