జీవ నోపాదుల అవకాశాలను పెంపొందిస్తూ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నందున కొరమీనుపెంపకం, షెడ్ నెట్స్ ను ఏర్పాటుచేసుకుని జీవనోపాదు లను మెరుగుపరుచుని అభివృద్ధి చెందాలని జిల్లా డీఆర్ డీఏ పీడీ టి.నారాయణ కోరారు. మండలంలో విఠలాపురం, దారంవారిపాలెం గ్రామాల్లో ఉదయ్
ఆక్వా డిఆర్డిఏ
సౌజన్యంతో ఏర్పాటు చేసిన కొరమీను యూనిట్, షెడ్ నెట్లను క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా పీడీ నారాయణ కొరమీను పెంపకం చేపట్టిన లబ్దిదారుడు పాలెపోగు గురవయ్యతో మాట్లాడారు. కొరమీను పెంపక విధానం, నిర్వహణ ఆహారం, వ్యాధి నియంత్రణ, మార్కెట్ అవకాశాలపై చర్చించి తగు సూచనలు ఇచ్చారు. తక్కువ పెట్టుబడితో కొరమీను పెంపకంతో అధిక ఆదాయం పొంద
వచ్చునన్నారు. షెడ్ నెట్సఏర్పాటు చేసి అనేక రకాల ఫల సంపద కూర
“గాయలు, ఆకుకూరలు పండించుకునే విదానం వల్ల అభివృద్ధి చెందవచ్చునన్నారు.” ఈవిధానంద్వారా గ్రామస్థాయి నుండి ఆర్ధికంగా వృద్ది పొంద వచ్చునన్నారు. ఆపథ కాలు
గ్రామీణ యువతకు, పొదుపు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధిని
స్తుందని, సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మారా బత్తుల సుజాత, ఎల్ హెచ్ డిపీఎం రజనీకాంత్, హెస్ఆర్డీ పీఎం కృష్ణారావు, హెచ్ ఆర్ డిపిఎం
ఎల్ నారాయణ, ఏపీఎం దేవరాజ్, సీసీలు తదితరులు పాల్గొన్నారు.
