కంటోన్మెంట్ , జే ఎస్ డి ఎం న్యూస్ :
న్యూ బోయిన్ పల్లి ప్రభుత్వ బాలుర ప్రాధమిక ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు గౌసుద్దీన్ పదవీ విరమణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ.. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారి జీవితానికి బంగారు బాటలు వేసే ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం మంజూల. ఉపాధ్యాయులు చాముందేశ్వరి. స్థానికులు షకీబ్ హుస్సేన్. టెంట్ రాజు. మధు. నర్సింహా. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

