ప్రజల సంక్షేమానికే కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతున్న దని రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి జి. వేణుబాబు అన్నారు. ఎన్టీఆర్ భరోసా
పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అన్ని గ్రామాల్లో శనివారం జరిగింది. అధికారులు, అధికార పార్టీ నేతలు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. కొర్రపాటి వారిపాలెంలో జరిగిన పెన్షన్ల కార్యక్రమంలోఎంపీడీవో అజితతో కలిసి వేణుబాబు పెన్షన్లు పంపిణీ చేశారు.ఈసం దర్భంగా వేణుబాబు మాట్లాడుతూ అవ్వా తాతలు ఆనందంగా వుండాలన్న ఉద్దేశ్యంతో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా క్రమం తప్పకుండడా ఇస్తున్నారని, సెలవు వస్తే ముందురోజే అందజేస్తున్నారన్నారు. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబును పెద్దన్నగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
చిన్నన్నగా ప్రజలుభావిస్తు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తాళ్లూరులో టీడీపీ నాయకులు ఐ.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్పౌజ్, డయాలసిస్ వ్యాధి
గ్రస్తులకు కొత్తగా మంజూయిన పెన్షన్లు అందజేశారు. మండలంలోని 16 పంచాయతీలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మొదటి రోజు 88.3శాతం జరిగినట్లు ఎంపీడీవో పి.అజిత తెలిపారు. మండలంలో 6135 మంది పెన్షన్ దారులు వుం
డగా మొదటి రోజు 5417మందికి పెన్షన్ల పంపిణీ జరిగినట్లు తెలిపారు. ఆయాకార్య క్రమాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ గ్రామాల్లోని వితంతువులకు, వృద్ధులకు,దివ్యాంగు లకు, వివిధ రకాల పెన్షన్లు లబ్దిదారులకు గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఆయాకార్యక్రమాల్లో టీడీపీ నేతలు అనపర్తి ఆదామ్, అనపర్తి సుబ్బారావు,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

