సనత్ నగర్ ఫిబ్రవరి 1 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
సనత్ నగర్ ప్రభుత్వ విద్యార్థులు తమ ప్రతిభను చూపారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ యూత్ ఫర్ సేవ, ఎన్ జీ ఓస్ మేడ్చల్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల నుండి సుమారు 300 పాఠశాలల విద్యార్థుల మధ్య చిగురు
అనే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సనత్ నగర్ ఓల్డ్) కు చెందిన 9వ తరగతి విద్యార్థులు అక్షయ శ్రావణి సహజ సాయి కీర్తన లక్ష్మీ కళ గ్రూప్ కు డ్యాన్సులో రెండవ బహుమతి లభించింది. 9వ తరగతి విద్యార్థిని కుమారి సఫూర కు , జస్ట్ ఏ మినిట్ ‘ అనే కార్యక్రమంలో రెండవ బహుమతి లభించింది. విద్యార్థులు పోటీలో రెండు బహుమతులు
గెలుచుకోవడంగర్వకారణమనిపాఠశాలప్రధానోపాధ్యాయురాలు మార్త తెలిపారు.


