కంటోన్మెంట్ ఫిబ్రవరి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ బోయిన్ పల్లి న్యూ సిటీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయాన్ని వివిధ రకాలైన పూల మాలలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. స్వామివారి 24వ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం నుండి శ్రీవెంకటేశ్వర స్వామి వారి హోమము, లలిత పారాయణం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపనప్రతాప్ విద్యావతి దంపతులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుక మల్లికార్జున్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ అంజయ్యలు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమం కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ గావించారు.ఈ వేడుకలలో ఆలయ కమిటీ అధ్యక్షులు రుమాండ్ల నారాయణ, ఉపాధ్యక్షుడు గుంటూరు రామ్మోహన్ రావు, కార్యదర్శి జలతారు యాదయ్య, ఉప కార్యదర్శి అన్నపరెడ్డి ఆత్మానంద రెడ్డి, కోశాధికారి బచ్చు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు పోకూరి మోహన్ రావు, చింత కింది జగన్నాథం , శ్రీ లత, ప్రధాన అర్చకులు తిరుమల పవన్ కుమార్ స్వామి,శ్రీధర్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


