చిన్నారుల ప్రతిభ ను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి ….కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్…

కంటోన్మెంట్ ఫిబ్రవరి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
చిన్నారుల ప్రతిభ ను ఉపాధ్యాయులు గుర్తించి , వారి భవిష్యత్ కు పునాదులు వేయాలని, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. బోయిన్ పల్లి లో రోజ్ పెటల్స్ స్కూల్ వార్షికోత్సవ , గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జంపన ప్రతాప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చిన్నారులుఏ సబ్జెక్టు ల లో ఆసక్తి కలిగి ఉన్నారో గమనించి ఉపాధ్యాయులు వారిని ఆయా సబ్జెక్టుల లో ప్రోత్సహించాలని జంపన అన్నారు. విద్యతో పాటు వారికి ఆసక్తి ఉన్న క్రీడలు, డ్రాయింగ్, ఎస్ ఏ రైటింగ్ వాటిలోప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు పలు రంగాల్లో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు మెడల్స్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరత్ ప్రసాద్ మిశ్రా, ఉపాధ్యాయులు గీత, సుప్రియ, జ్యోతి, రాధిక విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *