పొర్ణమి పూజలు .. అన్న దానం…అన్న దాన వితరణ లో పాల్గొన్న బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన, పాండు యాదవ్…

బోయిన్ పల్లి ఫిబ్రవరి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ ఆరవ వార్డు సీతారాం పురం కాలనీ లో ని శివ పంచాయతన హనుమాన్ దేవాలయం లో ఆదివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్న దాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులు గా బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బోర్డ్ మాజీ సభ్యులు పాండు యాదవ్ హాజరయ్యారు. ప్రతి నెల పౌర్ణమి రోజు దాత ల సహకారం తో అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సాయిబాబా యాదవ్ తెలిపారు.అనంతరం అతిథులుమాట్లాడుతూ.అన్నదానం నిర్వహించిన దాత రాజశేఖర్ చేసిన సేవ అభినందనీయమన్నారు. దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని జంపన ప్రతాప్, పాండు యాదవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయ్ బాబు, గోవర్ధన్ రాజు, శ్రీకాంత్ రెడ్డి, ప్రకాష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *