జహంగీర్ పీర్ దర్గాలో జక్కుల ప్రత్యేక ప్రార్థనలు.తప్పుడు కేసుల నుంచి కే సి ఆర్ ను కాపాడాలని ప్రార్థన.

బోయిన్ పల్లి ఫిబ్రవరి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ ప్రియతమ నాయకులు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడడం దురదృష్టకరమని, అక్రమ కేసుల నుంచి దేవుడు కే సి ఆర్ ను కాపాడాలంటూ జక్కుల మహేశ్వర్ రెడ్డి జహంగీర్ పీర్ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆయనపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. న్యాయం తప్పకుండా గెలుస్తుందని తమ అధినేత కేసిఆర్ కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని జహంగీర్ పేరు దర్గా వద్ద ప్రార్ధించినట్లు జక్కుల మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. మళ్లీ ఆయన ముఖ్యమంత్రి చేయాలని దర్గాలో ప్రార్థించానన్నారు.జక్కుల వెంట మైనార్టీ ప్రెసిడెంట్ హసీన్ ఖాన్, బి శ్రీనివాస్, సమదాని, ఆరిఫ్, షంషాద్, హనీఫ్ ,అఖిల్ బాబా ,ఇక్బాల్, ఖదీర్, సమీర్ ,ఆజామ్, రిజ్వాన్ ,అస్లం ,ఆశు ,ఇర్ఫాన్, తారిఖ్ ,సాజిద్, రియాజ్, ఫరాజ్ ,ఇమ్రాన్ లు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *