కంటోన్మెంట్ ఫిబ్రవరి 2,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
తనతో అత్యంత సన్నిహితంగా మెలిగే అడ్ల శ్రీనివాస్ హఠాన్మరణం జీర్ణించుకోలేక పోతున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ హఠాన్మరణంతో కాంగ్రెస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందనీ అన్నారు. నిత్యం తన వెంట ఉండే వ్యక్తి ఆదివారం రాత్రి గుండెపోటుకు మరణించడం ఎంతో బాధగా ఉందన్నారు.
సోమవారం ఎమ్మెల్యే శ్రీగణేష్ తన అనుచరులు,పార్టీ నాయకులతో కలిసి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయన పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు., శ్రీనివాస్ సతీమణి సుజాత, కుమారుడు అభిజిత్, కుమార్తెలు హిమజ, హిమవర్ష లను ఓదార్చి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాననిభరోసానిచ్చారు.
అనంతరం శ్రీనివాస్ అంతిమ యాత్రలో పాల్గొని పాడెను స్వయంగా మోసి చివరిసారి కన్నీటి వీడ్కోలు పలికారు. తనకు దగ్గరగా ఉండే శ్రీనివాస్ మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు.శ్రీనివాస్ మరణంతో కంటోన్మెంట్ నియోజకవర్గం, తుకారాం గేట్ ప్రాంతాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ అంతిమ యాత్రలో కంటోన్మెంట్ నియోజకవర్గం లోని ముఖ్య నాయకులు,వార్డు 2 కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శ్రీనివాస్ కి అంతిమ వీడ్కోలు పలికారు.

