విద్యార్థులు ఆరోగ్యంపై శ్రర్థ ప్రత్యేక శ్రర్ధ వహించాలని తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి ఎం ప్రవీణ్ కుమార్ అన్నారు. తాళ్లూరు కస్తూరిభా పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 36 మంది విద్యార్థులకు కళ్ల పరీక్షలు నిర్వహించారు. 78 మంది విద్యార్థులకు హిమో గ్లోబిన్, బ్లెడ్ గ్రూప్ టెస్ట్లు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. వ్యక్తి గత శుభ్రత పాటించాల్సిన ఆవశ్యకత ను వివరించారు. కార్యకమ్రంలో ప్రిన్సిపాల్ సుజిత, వైద్యులు రాజేష్ యాదవ్, సీహెచ్ ఫాతిమా, హెచ్ ఎన్ రవి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

