9905 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 40శాతం ఫీజు రీఎంబర్స్మెంటు విడుదల – వివరాలు వెల్లడించిన జిల్లా షేడ్యూల్ కులముల సంక్షేమం మరియు సాధికారిత అధికారి ఎన్ లక్ష్మానాయక్

జిల్లాలోని అర్హత పరిశీలన పూర్తి అయిన 9905 మంది ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు విడుదల చేసినట్లు జిల్లా షేడ్యూల్ కులముల సంక్షేమం మరియు సాధికారిత అధికారి ఎన్ లక్ష్మానాయక్ తెలిపారు. జిల్లాలోని 245 కళశాలకు గాను 180 కళాశాలలు మొదటి విడుతగా నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. షేడ్యూల్ కులముల విద్యార్థులు మొత్తం 15075 అందులో రెన్యువల్స్ 9307, ఫ్రెషర్స్ 5768 మంది గాను 13996 మంది విద్యార్థుల అర్హత ప్రమాణాలు పరిశీలించగా 9905 మందికి పూర్తి అయ్యాయని వారికి మిగిలిన 4091 మందికి నిధులు రెండు మూడు రోజులో సీఎఫ్ ఎం ఎస్ ద్వారా జమ చేయటం జరుగుతుందని చెప్పారు. ఇంకా 860 మంది విద్యార్థులకు సంబంధించిన వివరాలు సచివాలయం ద్వారా పరిశీలించవలసి ఉన్నదని, 219 మంది విద్యార్థులకు అర్హత పరిశీలించవలసి ఉన్నదని అందుకు సంబంధించిన అర్హతలను వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *