ప్రజలకు త్వరిత గతిన న్యాయం జరిగేలా నూతన క్రిమినల్ చట్టాలు రూపొందించినట్లు ఎస్సై
మల్లిఖార్జున రావు అన్నారు. తాళ్లూరు ఐకేపీ కార్యాలయంలో బుధవారం నూతన క్రిమినల్ చట్టాలు, ఆన్లైన్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మల్లిఖార్జున రావు మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన న్యాయం సాధననే లక్ష్యంగా ఉన్నట్లు చెప్పారు. అధికార పరిధితో సంబంధం లేకుండా జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు ఉన్నట్లు వివరించారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, వాహన దారులు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించి నురక్షిత ప్రయాణం సాగించాలని కోరారు. నూతన వాహన చట్టం ప్రకారం మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులకు రూ. 25వేల వరకు జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలను ప్రొత్సహించవద్దని కోరారు. అనంతరం కార్యాలయం నుండి వెల్లంపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవ హారం ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో ఐకేపీ ఎపీఎం దేవరాజ్, ఎం ఎం ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు సుజాత, లీ, సీసీలు మోహన రావు, కోటేష్ బాబు, ఓబి, విఓఏలు పాల్గొన్నారు.


