క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పలు సర్వేలను ఎంపీడీఓ అజిత బుధవారం తనిఖీ
నిర్వహించారు. మాధవరం, తాళ్లూరులలో జరుగుతున్న యూనిఫైడ్ సర్వే, అక్షర ఆంధ్ర సర్వేల తీరును పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సచివాలయ సిబ్బందికి సహకరించి సర్వేలో నమోదు చేసుకోవాలని కోరారు. ఆయా గ్రామాల గ్రామ కార్యదర్శులు షేక్ షహనాజ్ బేగం, నాగ మల్లేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.

