బోయినపల్లి మాధవరం ఎస్టేట్స్‌పై చర్యలకు రంగం సిద్ధం..

బోయిన్ పల్లి ఫిబ్రవరి 5 (జే ఎస్ డి ఎం న్యూస్) :
బోయిన్ పల్లి పరిధిలోని మాధవరం ఎస్టేట్స్ పై చర్యలు చేపట్టేందుకు కంటోన్మెంట్ బోర్డ్ యంత్రాంగం సిద్ధమైంది.
కంటోన్మెంట్ బోర్డు అధికారులను ,అప్పటి నాయకులను రాజకీయ పలుకుబడి ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఓ స్థలం లో జీ హెచ్ ఎం సి అనుమతులతో పెద్ద ఎత్తున నిర్మాణాలను చేపట్టారు.ఈ నిర్మాణాలపై న చర్యలు చేపట్టేందుకు కంటోన్మెంట్ బోర్డు నోటీసులను అందజేసి చర్యలకు రంగం సిద్ధం చేసింది. కంటోన్మెంట్‌ ఆరవ వార్డు, ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌ల సరిహద్దులో వెలిసిన మాధవరం ఎస్టేట్స్‌పై చర్యలకు బోర్డు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కంటోన్మెంట్‌ పరిధిలోని స్థలంలోకి చొచ్చుకు వచ్చిన ఈ కాంప్లెక్స్‌కు సంబంధించి బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టడం,ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ బోర్డు అధికారులు మూడేళ్ల క్రితమే సదరు నిర్మాణదారుకు నోటీసులు జారీ చేయడంతో పాటు, ఆ భవనం గోడలకు సంబంధిత ప్రతులను అంటించారు. అయినప్పటికీ యజమానులు సదరు నిర్మాణాన్ని యధావిధిగా కొనసాగించారు. ఇటీవల నగరంలోని ఓ ఎమ్మెల్యే మాధవరం ఎస్టేట్స్‌పై బోర్డు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బోర్డు పరిధిలోని స్థలంలో చేపట్టిన నిర్మాణంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బోర్డు అధికారులు మరోసారి నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశారు.
తమ పరిధిలోకి వచ్చే స్థలంలో భవన నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారంటూ జీహెచ్‌ఎంసీ అధికారులకూ లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాధవరం ఎస్టేట్స్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కంటోన్మెంట్‌ అధికారుల
తాజా నోటీసులతో మార్టిగేజ్‌ను రిలీజ్‌ చేయకుండా పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.మొత్తం మీద ఎమ్మెల్యే పిర్యాదుతో కంటోన్మెంట్ చలనం వచ్చిన అధికారులు.అక్రమ భవన నిర్మాణం పై ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *