కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్..

కంటోన్మెంట్ ఫిబ్రవరి 5
(జేఎస్ డి ఎం న్యూస్) :
మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గం లోని మహిళా సోదరీమణులకు 200 కుట్టు మిషన్లు మంజూరు అయ్యాయి. గురువారం లీ ప్యాలెస్ లో నిర్వహించిన పంపిణీ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై మైనారిటీ సంక్షేమ అధికారులతో కలిసి మహిళా సోదరీమణులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభ నుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ..
మహిళలు ఆర్ధికంగా బలపడినప్పుడే కుటుంబాలు బాగుంటాయని, మహిళా సోదరీమణులు తమ కాళ్లపై తాము నిలబడేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిస్తుందని అన్నారు . రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో కూడ మహిళల అభ్యున్నతికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లి కార్జున్. .
బోర్డు మాజీ ఉపాధ్యక్షులీ జంపన ప్రతాప్,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఇలియాజ్ అహ్మద్ ఇతర అధికారులు, నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *