బోయిన్ పల్లి ఫిబ్రవరి 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్ ఆర్ బీ ఐ నివాసాల ముందు ఉన్న ఫుట్ ఫాత్ ఆక్రమణలను తొలగించేందుకు గురువారం ట్రాఫిక్, లాఅండ్ ఆర్డర్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా కదిలి వచ్చారు. జేసీబీల సహాయంతో ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్ని డబ్బాలు తొలగించిన తర్వాత స్థానికులు, డబ్బాల నిర్వహకులు అధికారులతో తమకు 5 రోజుల సమయం ఇవ్వాలని, స్వచ్చందంగా డబ్బాలన్నీ తామే తొలగించుకుంటామని అధికారులకు విజ్ఞప్తి చేసారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు అధికారులు చర్చించి ఐదు రోజుల సమయాన్ని ఇచ్చారు. అనంతరం ఏసీపీ శంకరరాజు మాట్లాడుతూ బేగంపేట లో ట్రాఫిక్ అత్యంత రద్దీగా ఉంటుందని, బేగంపేట నుంచి బల్కంపేట, ఫతేనగర్, కూకట్పల్లి వై జంక్షన్, బోయిన్ పల్లి జంక్షన్, బాలానగర్లతో పాటు వివిధ ప్రాంతాలకు వాహనదారులు ప్రయాణిస్తుంటారని, అయితే శ్యాంలాల్ బిల్డింగ్ జంక్షన్లో ఉదయం, సాయంత్రం సమయంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ పనుల కోసం వెళ్లే వారికి జంక్షన్లో తీవ్రంగా అవుతున్న ట్రాఫిక్ జాంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ పోలీసు కమ్యూనిటీ గ్రూపులో స్థానికులు పిర్యాదులు వెల్లువలా రావడంతో అధికారులు స్పందించారు. అయితే తమకు ఐదు రోజుల సమయం ఇస్తే తామే స్వచ్చందంగా డబ్బాలను తొలగించుకుంటామంటూ వారు అధికారులకు విజ్ఞప్తి చేయడంతో అధికారులు స్పందించి సమయం ఇచ్చారు. అనంతరం ఏసీపీ జి.శంకరరాజు మాట్లాడుతూ బేగంపేట లో ట్రాఫిక్ సమస్య ను నివారించేందుకు పాదచారులు ఫాదబాటలను వినియోగించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానికుల అభ్యర్ధన మేరకు కొంత సమయం ఇచ్చామని, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అన్ని ఆక్రమణలు తొలగిస్తామని ఏసీపీ తెలియజేసారు. ఈ అక్రమణల తొలగింపు కార్యక్రమంలో మల్కాజ్ గిరి ట్రాఫిక్ 1 డీసీపీ ఎ. లక్ష్మి, తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ జి.శంకరరాజు, బేగంపేట లా అండ్ ఆర్డర్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, అల్వాల్ సర్కిల్, బోయిన్పల్లి ఇంచార్జి అసిస్టెంట్ టౌన్ ప్లానర్ శ్రీనివాస్, బేగంపేట లా అండ్ ఆర్డర్ ఇన్స్ పెక్టర్ సైదులు, ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ జి.జానకి రాములు, అల్వాల్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ సీహెచ్ శంకరయ్య, లాఅండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఎస్సైలు, ఏఎస్సైలు, మహిళా పీసీలు పాల్గొన్నారు.

