కంటోన్మెంట్ ఫిబ్రవరి 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మోండా డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా వెస్ట్ మారేడ్ పల్లి అల్లాడి పెంటయ్య నగర్ మైసమ్మ దేవాలయం ప్రాంతంలో 36 లక్షల రూపాయలతో వేయనున్న సిమెంట్ రహదారి పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. గురువారం
జీ హెచ్ ఎం సి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి
పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం అయితే ఇదేమాదిరి అభివృద్ధి కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా చేయవచ్చనిఅన్నారు.కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలనే తాను ఇటీవల నిరాహార దీక్ష కూడా చేసి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చానని చెప్పారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పనుల ప్రారంభోత్సవంలో స్థానిక కార్పొరేటర్ దీపిక, జీ హెచ్ ఎం సి అధికారులు డిప్యూటీ కమిషనర్ ఢాకు నాయక్, డిప్యూటీ ఇంజినీర్ దీపిక, అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్ దేవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, వైష్ణవి యాదవ్, టెంపుల్ కమిటీ చైర్మన్ లు ప్రభాకర్ యాదవ్, గౌరీ శంకర్, వెంకట్రాజు, ధనలక్ష్మి, శేఖర్ ముదిరాజ్, నందికంటి రవి, నాగేందర్ యాదవ్, శ్యామ్ సుందర్ రెడ్డి, అజయ్ కుమార్, సంతోష్ (విక్కీ), సాయి తదితరులు పాల్గొన్నారు.

