కంటోన్మెంట్ ఫిబ్రవరి 6
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ట్రాఫిక్ ను నియంత్రించే ట్రాఫిక్ పోలీసులు పారా ,తట్టా పట్టారు గుంతలతో వాహన దారులు పడుతున్న ఇబ్బందులపై సంబంధిత శాఖ ల అధికారుల స్పందనకు ఎదురు చూడకుండా ట్రాఫిక్ పోలీసులే కార్మికులయ్యారు.గుంతలను మట్టి తో పూడ్చి వాహన దారులు చింతలను తీర్చారు.రక్షణ విభాగం అధికారులు నివసించే కంటోన్మెంట్ పరిధిలో రోడ్లు గుంతలు పడి వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు మట్టి తెప్పించి సెంటర్ పాయింట్ జంక్షన్ లో పెద్ద పెద్ద గుంతలను పూడ్చారు.ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రాఫిక్ ఏ సి పి జి.శంకర్ రాజు సెంటర్ పాయింట్ వద్దకు చేరుకుని ట్రాఫిక్ పోలీసులను అభినందించారు.సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి గుంతలను శాస్వితంగా పుడ్స్తానని తెలియ జేశారు.ట్రాఫిక్ ఎస్సై సిబ్బంది దేవదాస్,మహేష్ ,నసీరుద్దీన్ సయ్యద్ మియా, మహేందర్ లు ఉన్నారు.



