బేగంపేట ఫిబ్రవరి 6
(జె ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ పరిధిలోని అన్ని ఆలయాలు, మసీదుల వద్ద పారిశుద్ధ్య మెరుగు, వీధిలైట్ల నిర్వహణ పై ,తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిహెచ్ఎంసి బోయిన్ పల్లి డిప్యూటీ కమిషనర్ డాకునాయకును బేగంపేట కార్పొరేటర్ టి. మహేశ్వరి శ్రీహరి శుక్రవారం కలిసి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. మహాశివరాత్రి , రంజాన్ పర్వదినాలను పురస్కరించుకొని డివిజన్ లో తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు. ప్రతి ఏటా మహాశివరాత్రి రంజాన్ పర్వదినాల సందర్భంగా ఆలయాలు మసీదుల వద్ద పారిశుద్ధ్య మెరుగుకు వీధిలైట్ల ఏర్పాటుకు తగిన ప్రాధాన్యమిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయా ప్రాంతాల్లోని ఆలయాలు, మసీదుల వద్ద ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని డి సి నీ కోరినట్లు కార్పొరేటర్ తెలియజేశారు.డి సి నీ కలిసిన వారిలో కార్పొరేటర్ వెంట బి ఆర్ ఎస్ నాయకులు టి శ్రీహరి ఉన్నారు.

