విద్యార్థులు పాఠశాలకు సక్రమంగా హాజరు అయ్యేలా ఉపాధ్యాయులు తగిన చర్య
తీసుకోవాలని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య కోరారు. బొద్దికూరపాడు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల (మోడల్ పాఠశాల) ను ఆయన శుక్రవారం తనిఖీ చేసారు. ఎంఈఓ- 1 జి సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర్ రావు, పరిశీలకుల పాల్గొని ఉపాధ్యాయులచే మోడల్ పాఠాలు చెప్పించారు. విద్యార్థుల పురోగతిని అంచనా వేసారు. 75 రోజుల జీ ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చెయ్యాలని, పాఠశాల రోల్ పెంచాలని, మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చెయ్యాలని చెప్పారు. పాఠశాల పరిసరాలు, రికార్డులను, మధ్యాహ్నభోజన పథకం, పాఠశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. పరిశీలకులు వెంకటేశ్వర్లు, శర్మ, అశోక్ చక్రవర్తి, శేషు, హెచ్ఎం పద్మజ, సీఆర్పీ మారుతి, పీఎంసీ చైర్మన్ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
