చైనా మంజా కు చిక్కుకుని విల విల లాడుతున్న గద్ద ను రక్షించి ప్రాణదానం చేసిన మల్కాజ్ గిరి ట్రాఫిక్ ఉప కమీషనర్, ఎసిపి.

బేగంపేట ఫిబ్రవరి 7,(జే ఎస్ డి ఎం న్యూస్) :
చైనా మాంజాకు చిక్కుకుని చెట్టు కొమ్మల్లో విలవిల లాడుతున్న గద్ద ను రక్షించారు.అటుగా వెళుతున్న మల్కాజ్ గిరి ట్రాఫిక్ 1ఉప కమీషనర్ ఏ.లక్ష్మీ,తిరుమల గిరి డివిజన్ ట్రాఫిక్ ఏ సి పి శంకర్ రాజు లు బేగంపేట టి టి ఐ నుంచి బయటకు వెళుతున్న సమయంలో గద్ద ను గమనించారు.వెంటనే ట్రాఫిక్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.దగ్గర ఉండి చైనా మాంజా కు చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకునే పరిస్తితిలో ఉన్న గద్ద ను చెట్టు నుంచి కిందికి దించారు.దానికి చుట్టుకున్న మాంజా ను తొలగింప జేశారు.గద్ద ను రక్షించారు.దీంతో అది రివ్వు మంటూ గాల్లోకి ఎగిరి పోయింది ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారులు మాట్లాడుతూ నిషేధిత మాంజా వాడకం వల్ల పక్షులు,జంతువులకే కాకుండా మనుషులకు కూడా తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుందనన్నారు.ఈ ఏడాది చైనా మాంజా వల్ల జంటనగరాల్లో చాలామంది పౌరులు(వాహనదారులు)తీవ్రంగాగాయపడ్డారని ,అన్నారు.నిషేధిత చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని విజ్ఞప్తి చేశారు.ట్రాఫిక్ పోలీసులు అంటే నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు కేవలం చలాన్లు వేయడమే కాదు.
అత్యవసర పరిస్థితుల్లో గుంతలు పడ్డ రోడ్లను పూడ్చడం కాకుండా గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించడం,ఎవరైనా వాహనదారుడు అత్యవసర పరిస్థితుల్లో ఉంటే వారికి సి పి ఆర్ చేసి ప్రాణాలు కాపాడటం చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *