ఇంటి పన్నుల వసూలుకు తాళ్లూరులో ఎంపీడీఓ అజిత ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక డైవ్ ను నిర్వహించారు. ఆయా వీధులలో లబ్దిదారులకు నోటీసులు అందించి పన్నులు చెల్లించి గ్రామాభివృధ్ధికి పాటు పడాలని కోరారు. అనంతరం ఎంపీడీఓ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షర – ఆంధ్ర సర్వే నిర్వహణను పరిశీలించారు. చెత్త సంపద కేంద్రంను పరిశీలించారు. గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం, నచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
