చివరి కన్నీటిబొట్టునైనా ఆపగలిగే ప్రయత్నమే మానవత సంస్థ ధ్యేయం -మానవతా స్వచ్ఛంద సేవా సంస్థజిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి

సామాన్య ప్రజలను కష్టకాలంలో ఆదుకోవడానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి తలకు,కాలికి ఆపరేషన్ చేయించుకుని,గతంలో బార్యను పోగొట్టుకొని ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం మంచానికే పరిమితమై ఎలాంటి ఆధరణలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న ముండ్లమూరు మండలం పులిపాడుకు సమీపాన గల బంగారమ్మగుట్ట గ్రామానికి చెందిన రాచగొర్ల రాజయ్య అనే నడవలేని యువకుని ధీనస్థితి మానవత సంస్థకు తెలియగా ఈరోజు దరశి మానవత స్వచ్ఛంద సేవాసంస్థ చైర్మన్ దేవతి వరప్రసాదు,ప్రకాశం జిల్లా మానవత సంస్థ ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి,అధ్యక్షులు చీదెళ్ళ.బసవయ్య, అత్యవసర విభాగం డైరెక్టర్ రోశారావు,సభ్యులు నారాయణ లు బంగారమ్మగుట్ట గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి, వారికి మనోధైర్యాన్ని నింపి, సంస్థ తరుపున ₹5000/-(ఐదువేల రూపాయలు) లు నగదును అందజేసి, ఆత్మీయ సహకారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మానవత సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి మాట్లడుతూ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ మహోన్నతమైన ఆశయాలు,విలువలుగలిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 141 శాఖల(కేంద్రాల)లో నిరంతరం ఎవరూ చేయలేనటువంటి సేవలు చేస్తూ, ప్రజలలో మంచి ఆదరణ పొందిన సంస్థని, ఎలాంటి ప్రతిఫలాపేక్షలేకుండా,రాజకీయాలకు,కులాలకు,మతాలకు అతీతంగా నిరంతరం నిస్వార్థంగా సేవచేస్తున్న మానవతామూర్తులు ఈ సంస్థలో సేవలందిస్తున్నారని,అందరూ ఈ సంస్థ మహోన్నతమైన సేవలను వినియోగించుకొని, సంస్థ అభివృధ్ధికీ భాగస్వాములు కావాలని కపురం శ్రీనివాసరెడ్డి ప్రజలను వేడుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *