కంటోన్మెంట్ ఫిబ్రవరి 8
(జే ఎస్ డి ఎం న్యూస్) :
జై రామ్ వ్యాయామశాల భవన నిర్మాణానికి రూ 20 లక్షల నిధులు కేటాయించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ కృతఙ్ఞతలు తెలియ జేశారు. కంటోన్మెంట్ ఒకటవ వార్డు పెద్ద తోకట్టలోని జై రామ్ వ్యాయామశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ రూ 20 లక్షల రూపాయలు నిధులు కేటాయించారని ,
ఈ సందర్భంగా జంపన ప్రతాప్ తో పాటు వ్యాయామశాల సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు .ఆదివారం జయరాం వ్యాయామ శాల నూతన భవన నిర్మాణం కోసం పనులు చేపట్టే కాంట్రాక్టర్, జంపన ప్రతాప్, వ్యాయామశాల సభ్యుల ఆధ్వర్యంలో కొలతలు సేకరించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ఈ వ్యాయామశాల నుండే ప్రారంభమైందని, వ్యాయామశాలకు శాశ్వత భవనం నిర్మించాలనే తన కల నెరవేరుతుందని అన్నారు. గత ఎన్నికల సమయంలో తన సమక్షంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ భవన నిర్మాణానికి హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామశాల అధ్యక్షులు బచ్చన్ రాజు యాదవ్, పోతరాజు సాయి, గిరి గౌడ్, దామోదర్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, గౌతమ్, తేజ, పప్పు ,వరప్రసాద్ ,సందీప్, సాయిబాబా యాదవ్, కరణ్ తదితరులు ఉన్నారు.

