జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు, ఆశీర్వాదం అందించారు. ఈఓ నర్రా నారాయణ రెడ్డి, ఆర్ ఏ ప్రసాద్ భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు. గుంటి గంగా భవాని ఆలయ అన్నదాన సత్రంలో అన్నదానం నిర్వహించారు.
