సనత్ నగర్ పిబ్రవరి 9
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని బీజేపీ రాష్ట్ర యువ నాయకులు మర్రి పురు రవా రెడ్డి అన్నారు.ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం లో భాగంగా బీ జే పి మహిళా మోర్చా నాయకురాలు స్వప్న గుప్తా ఆధ్వర్యంలో సనత్ నగర్ లోధా అపార్ట్మెంట్ లో మహిళలకు మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మర్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు నేడు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో వారితో పోటీ పడుతున్నారని,ప్రతిభ చూపుతున్నారని అన్నారు.పోటీలలో పాల్గొని విజయం సాధించిన వారికి మొదటి.రెండవ బహుమతులను అందజేశారు.పార్టిసిపేట్ సర్టిఫికెట్ లను అంధ జేశారు.కార్యక్రమంలో బీ జే. పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దయానంద్,వంశీ కృష్ణ,ఉమా,శ్రీనివాస్,అనుదీప్ రెడ్డి,మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

