తొర్రూరు ఫిబ్రవరి 9
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బీజేపీకి ఓటు అభివృద్ధికి చోటు.మోదీ జీ కి ఓటు పట్టణ ప్రగతికి బాట.కమలం వికసిస్తే పట్టణం వికసిస్తుంది అని తెలంగాణా రాష్ట్ర వెనుక బడిన తరగతుల వకుళా భరణం
కమీషన్ మాజీ చైర్మన్ , బీ జే పి నాయకుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. సోమవారం తోర్రూరులో నిర్వహించిన బీజేపీ పురపాలక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో రాష్ట్ర పార్టీ ముఖ్య ప్రచార సారథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందితే రాష్ట్రంలోని పట్టణాల సమగ్ర అభివృద్ధి వేగంగా సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు. మొదటి వార్డులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ పురపాలక ఎన్నికలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. పట్టణాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వ నిధులే ప్రధాన ఆధారమని స్పష్టం చేస్తూ, అభివృద్ధిని ఆశించే ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరారు.గత ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం రైతు భరోసా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక భద్రత, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి కీలక హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా
విమర్శించారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనలు పాలన ప్రారంభమైన తర్వాత కాగితాలకేపరిమితమయ్యాయని, హామీలు–అమలు మధ్య ఉన్న విస్తారమైన అంతరమే ప్రజల్లో అసంతృప్తిని పెంచిందని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఈ పురపాలక ఎన్నికల ద్వారా గట్టి సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని, అభివృద్ధి, పారదర్శక పాలన, కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో పనిచేసే బీజేపీకే ప్రజలు స్పష్టమైన మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్‌చార్జ్ లేగా రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, వరంగల్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే వన్నల శ్రీరాములు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు పి. రాజేష్, ఎన్నికల ఇన్‌చార్జులు దామోదర్ రెడ్డి, రంజిత్ రావు, కొలుపుల శంకర్, సుజాత, ఆశాల రాజిత శ్రీమాన్, పల్లె కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అభ్యర్థులతో కలిసి డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు తోర్రూరు పట్టణంలోని వివిధ వార్డుల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


