నాగంబొట్ల పాలెం సొసైటీలో ఇప్పటి వరకు 613.67 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేసినట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. సొసైటీ ద్వారా 357.52 మెట్రిక్ టన్నుల
యారియా, 129 డీఏపీ, 20: 20 122.15, పొటాష్ ఐదు అనగా 13068 బస్తాల యూరియాను 3561 మంది రైతులను అందించినట్లు చెప్పారు. నానో యూరియా 144 బాటిళ్లు, నానో డీఏఎపీ 24 బాటిల్స్ సరఫరా చేసినట్లు తెలిపారు. విచక్షణా రహితంగా ఎరువులు వాడవద్దని చెప్పారు. అవసరమైన మేర రైతులకు యూరియా నిరంతరం సరఫరా చేయబడుని చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ పి శ్రీనివాన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
