ఆక్వా డెవిల్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 26వ క్రిష్ణా రివర్ క్రాసింగ్ స్వీమ్మింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన నాగులుప్పలపాడు తిమ్మ సముద్రంకు గ్రామానికి చెందిన కొట్ర సీతారామయ్యను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అభినందించారు. ఒంగోలు స్పందన హాల్లో సోమవారం జాయింట్ కలెక్టర్ను కలిసి 72 సంవత్సరాల వయస్సు కలిగిన కొట్ర సీతారామయ్య తను సాధించిన పథకాలను చూపించారు. 2026 జనవరిలో మహారాష్ట్ర నాసిక్లో జరిగిన 5 వేల మీటర్లనడక పోటీల్లో కూడ పతకం సాధించినట్లు సీనియర్ సిటిజన్ సీతారామయ్య వివరించారు.
