ఒంగోలు నవోదయ విద్యాలయంలో సోమవారం జిల్లా స్థాయిలో ప్రేరణ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. నవోదయ ప్రిన్సిపాల్ సి శివ రామ్, కేంద్రయ విద్యాయ ప్రిన్సిపాల్ ఎం మనీష్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ శివ రామ్ మాట్లాడుతూ విద్యార్థులు సృతనాత్మకత, కళలు, నాయ కత్వ లక్షణాలు , సంస్కృతి, వారసత్వం లక్షణాలను పెంపొందించుకోవాలని అన్నారు. ప్రేరణ ఉత్సవంలో బాగంగా కళలు, చిత్ర లేఖనం, వ్యాస రచన, గాణ కచేరి పోటీలను నిర్వహించారు. పీఎం నరేంద్రమోదీ నేతృత్వంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం నేర్చుకోవటానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. ప్రేరణ ఉత్సవంలో ఒక బాలుడిని, బాలికను ఎంపిక చేస్తామని చెప్పారు. 50 మంది విద్యార్థులు పాల్గొనగా 30 మంది విద్యార్థులు అందులో 15 మంది బాలురు, 15 మంది బాలికలు ఎంపికయినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

