బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బొద్దికూరపాడు
జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు 200 మందికి న్కూల్ బ్యాగ్ ల ను పంపిణీ చేసారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని విద్యార్థులకు బ్యాగ్ ల ను అందించారు. పదవతరగతి విద్యార్థులకు బి వి ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా స్టడీ మెటీరియర్ పంపిణీ సమయంలో విద్యార్థులు తమ బ్యాగ్లు చిరిగి పోయాయని, స్కూల్ బ్యాగ్ లు ఇప్పించాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకాయమ్మ, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన వారు బ్యాగులను తమ ట్రస్ట్ ద్వారా సోమవారం అందజేసారు. ఈ నందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు ఎ అవసరం ఉన్నా నరే తాము ఆదుకుంటామని, తమ ట్రస్ట్ ద్వారా, జిల్లా పరిషత్ ద్వారా నిధులు కేటాయించి తగిన మౌళిక వసతులు కల్పిస్తామని చెప్పారు. పరీక్షలు దగ్గర పడుతున్నందుకు చక్కగా అభ్యసించి ఉత్తమ మార్కులు పొందాలని కోరారు. సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, రామి రెడ్డి, మాజీ మాధవస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పులి బ్రహ్మా రెడ్డి, ముచ్చమారి బ్రహ్మా రెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం అంజి రెడ్డి, ఉపాధ్యాయులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.


