బేగంపేట ఫిబ్రవరి 10
(జే ఎస్ డి ఎం న్యూస్) :
విద్యార్థులు ఏకాగ్రతతో చదివి 10 వ తరగతి లో మెరుగైన ఫలితాలు సాధించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన రాంగోపాల్ పేట డివిజన్ ఓల్డ్ గ్యాస్ మండి లో గల ఆదయ్య మెమోరియల్ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా 10 వ తరగతి విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. 10 వ తరగతి పరీక్షల సందర్భంగా ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్నాక్స్ పంపిణీ చేశారు. అనంతరం స్కూల్ లోని సమస్యల గురించి ప్రధానోపాధ్యాయుడు, ఇతర సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. స్కూల్ ఆవరణలో బోర్ రిపేర్ చేయించాలని, సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్కూల్ అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా స్కూల్ ఆవరణలో ఉన్న భవిత కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేంద్రంలో విద్యార్థుల సౌకర్యార్థం కార్పెట్ ఏర్పాటు చేయాలని కోరగా, వెంటనే పంపిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు బాలాజీ, సిబ్బంది భవాని, కల్పన, పుష్పలత, AAPC చైర్మన్ లావణ్య, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, నాయకులు కిషోర్, శ్రీహరి, కొండాపురం మహేష్ యాదవ్, సతీష్, గణేష్, జనార్దన్, రాజు తదితరులు ఉన్నారు. స్థానిక బస్తివాసులు లడ్డు, వినోద్, వినయ్, జగన్, శీను, అప్పి సురేష్ తదితరులు పాల్గొన్నారు.


