అకస్మాత్తుగా బ్రేన్, హార్ట్ స్టోక్ తో నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి (45) మృతి
చెందాడు. ఈ ఘటన రాజకీయ వర్గాన్ని విషాదం నింపింది. యువ నాయకుడైన ఇడమకంటి శ్రీనివాస రెడ్డి దీర్ఘకాలిక రాజకీయ కుటుంబమైన ఇడమకంటి వెంకట రెడ్డి రెండవ కుమారుడు. టిడిపిలో గత జెడ్పీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసాడు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి వెంకట రెడ్డి, బాబాయి రమణా రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ గొట్టిపాటి విజయానికి తీవ్రంగా కృషి చేసారు. నమీప బంధువైన డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని కాదని తమ రాజకీయ బంధమైన గొట్టిపాటి కుటుంబంతో నడచి తమ రాజకీయ బంధం విలువను ప్రదర్శించారు. నాటి నుండి పార్టీలో తనదైన మంద్ర వేసుకుని పార్టీ పటిష్టతకు డాక్టర్ గొట్టిపాటితో కలసి ముందుకు నడుస్తున్న తరుణంలో ఒక్కసారిగా స్టోక్ తో కుప్పకూలి, చికిత్స నిమిత్తం ఒంగోలు తరలిస్తుండగా మృతి చెందటం టిడిపి శ్రేణుల్లో విషాదంలో మునిగిపోయారు. ఆయన మృత దేహాన్ని సందర్శించి శోదిస్తున్నారు. ఆయనకు భార్య ప్రశాంతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కుటుంబాన్ని ఓదార్చటం ఎవరి తరం కాలేదు. నిత్యం రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే .. వ్యవసాయ పనుల్లో సైతం చురుకుగా చేసుకుంటూ ఉండే వారని, పని కావలసిన ఎవరైనా తన ఇంటికి వస్తే మర్యాదగా చిరునవ్వుతో పలకరించి పనిచేసే పంపే వారని ప్రజలు ఆయన బౌతిక కాయం వద్ద రోదించటం హృదయాలను కదిలించివేస్తుంది.
నివాళులు అర్పించిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి ….
ఇడమకంటి శ్రీనివాస రెడ్డి మృతదేహాన్ని దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఆయన భార్య ప్రశాంతిని ఓదార్చారు. ఎంపీ ప్రతినిధి బి సురేష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే లు నారపుశెట్టి పాపా రావు, బాచిన చెంచుగరటయ్య , ఐ ఓ ఎం గోరంట్ల రవికుమార్,
జెడ్పిటిసి మారం వెంకట రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు , వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి,ఇడమకంటి లక్ష్మిరెడ్డి, ఆర్ఎన్ ఏ డైరెక్టర్ ఓబులు రెడ్డి, పార్లమెంటు టిడిపి ఉపాధ్యక్షుడు కె నాగ రాజు, తాళ్లూరు, దర్శి, కురిచేడు టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, నెమిలయ్య, వెంకటేశ్వర్లు, మానం రమేష్, గొల్లపూడి వేణు, సొసైటీ అధ్యక్షులు నమర, నుబ్బయ్య ,
డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, నవులూరి సాగర్, పిన్నిక రమేష్, గ్రామపార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి, పాలం అంజి రెడ్డి, నారిపెద్ది కళ్యాణ్, వంగపల్లి నాగేశ్వర రావు, చాట్ల డానీ, జి లక్ష్మి నారాయణ, అది నారాయణ, వలి , హనుమా రెడ్డి, కోనేటి వెంకట రావు, శ్రీను , వలసారెడ్డి, రమణా రెడ్డి , పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస రెడ్డికి నివాళులర్పించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , వైసీపీజిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి …..
ఇడమకంటి శ్రీనివాస రెడ్డి మృత దేహాన్ని వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఆయన మృత దేహానికి పూల మాలలు వేసినివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, గోపాల్ రెడ్డి, స్థానిక నాయకులు వారి వెంట ఉన్నారు.


