ఇడమకంటి కి కన్నీటీ వీడ్కోలు – ప్రత్యేక వాహనంలో గ్రామంలో అంతియ యాత్ర – యాత్రలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ కడియాల – అధిక సంఖ్యలో వీల్కోలు యాత్రలో పాల్గొన్న ప్రజలు, మహిళలు

తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డికి తాళ్లూరు ప్రజలు,
టిడిపి శ్రేణులు, నాయకులు, బంధువులు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. శ్రీనివాస రెడ్డి నివాసం నుండి అంతిమ యాత్ర బయలు దేరి గాంధీ బొమ్మ, తూర్పు పాలెం, ఎస్సీ కాలనీ, వెల్లంపల్లి రోడ్, ఎన్ టిఆర్ విగ్రహం, తూర్పుగంగవరం రోడ్లోని బ్రహ్మాగారి గుడి వద్ద నుండి గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించి రుద్రభూమికి తరలించి అంతిమ సంస్కారాలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు శ్రీనివాస రెడ్డి తండ్రి వెంకటరెడ్డి బాబాయిలు రమణారెడ్డి, కోటిరెడ్డి , ఆయన భార్య పిల్లల్ని కుటుంబాన్ని ఓదార్చారు. అంతిమ యాత్రలో డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. ప్రజలు తుది చూపు కోసం అధిక సంఖ్యలో పాల్గొని యాత్ర బండితో నడిచి కన్నీటి తుది వీడ్కోలు చెప్పారు. ఆయన యాత్రలో చీమకుర్తి మాజీ ఎఎంసీ చైర్మన్ మారం వెంకా రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, నీటి డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైన్ చైర్మన్ తూము శివ నాగిరెడ్డి, మానం రమేష్ బాబు, షేక్ పెద కాలేషా వలి, గొల్లపూడి వేణుబాబు, రాచకొండ వెంకట రావు, నవులూరి విద్యా సాగర్, వంగపల్లి నాగేశ్వర రావు, నారిపెద్ది కళ్యాణ్, సీహెచ్ వీర నాగి రెడ్డి, చాట్ల డానీ, ఆదినారాయణ, కైపు రామకోటి రెడ్డి, నాగార్జున రెడ్డి, సొసైటీ చైర్మన్ సమర, సుబ్బయ్య, హనుమా రెడ్డి, మారం వెంకా రెడ్డి, పిన్నిక రమేష్, పాశం నూరి బాబు, లక్ష్మి నారాయణ, కోనేటి వెంకట రావు, శ్రీను, సుబ్బారావు ,ఆదాం , యోహాన్ పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *